Mahesh and Pawan : నేటి తరం హీరోల్లో యూత్ లో బాగా క్రేజీ ఉన్న హీరోలు ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు. వీళ్ల సినిమా అంటే చాలు కేవలం హీరోల పేరుపైనే కోట్లాది రూపాయలను కలెక్ట్ చేస్తాయి. బాక్సీఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టే సినిమాలు చేయడంలో వీరు దిట్ట. ఇప్పుడు పాన్ ఇండియా అంటూ హీరోస్ పుట్టుకస్తున్నా.. వీరి క్రేజ్ ను మాత్రం ఎవరూ చేరుకోలేదన్నది నమ్మలేని నిజం.
అయితే, ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి ఒక స్టార్ ప్రొడ్యూసర్ అడ్రస్ లేకుండా చేశారట. ఆయన ఎవరో కాదు సి. కళ్యాణ్. ఆయన ప్రొడక్షన్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కొమురం పులి’ వచ్చింది. ఇటు మహేశ్ బాబుతో ‘ఖలేజా’ కూడా చేశారు. పవన్, మహేశ్ చేసిన 2 సినిమాలు కేవలం నెల గ్యాప్ లో రిలీజయ్యాయి.
అయితే, ఇందులో కొమురం పులికి ఆ రోజుల్లో రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో పాటు ఖలేజాకు కూడా అదే రేంజ్ లో జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్ అయ్యయి. కొమురం పులి డిజాస్టర్ తో బయ్యర్స్ తర్వాత రిలీజయ్యే ఖలేజాపై ఆశలు పెంచుకున్నారు.
కానీ, దురదృష్టవశాత్తు ఆ మూవీ కూడా కొమురం పులికి మంచి డిజాస్టర్ మూట గట్టుకుంది. ఇలా రెండు సినిమాలతో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ కు రూ. 40 కోట్ల మేర నష్టం వచ్చాయట. కేవలం ఈ రెండు సినిమాల కారణంగానే ఆయన చాలా రోజులు మరో సినిమాకు ప్రొడ్యూస్ చేయలేదు. ఇక అప్పటి నుంచి పెద్ద హీరోలతో సినిమాలు చేయవద్దని అనుకున్నారట.