Kodipandalu : పందెం గెలిస్తే విజేతలకు మహేంద్ర థార్

Kodipandalu : ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. అందరూ ఉత్సాహంగా పట్నాల నుంచి పల్లెబాట పట్టారు. జోరుగా పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా కోడిపందేలు బాగా సాగుతున్నాయి. స్వయంగా సీఎం చంద్రబాబు సైతం తన సొంతూరు నారావారి పల్లెలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొంటున్నారు.

ఇక ఏపీలోని గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు ఆడుతున్నారు. అక్కడ పందెం బరులు వద్దే గుండాట మొదలైంది.

కరప లో నిర్వహించే కోడి పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించిన నిర్వాహకులు ఊహించని సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఏకంగా 20 లక్షల కారును ప్రైజ్ మనీగా పెట్టడంతో అంతా ఉత్కంఠ నెలకొంది.

TAGS