JAISW News Telugu

Mahbub Nagar DEO : ఏసీబీ వలలో మహబూబ్ నగర్ డీఈవో

Mahbub Nagar DEO

Mahbub Nagar DEO

Mahbub Nagar DEO : మహబూబ్ నగర్ ఇంచార్జి డీఈవో రవీందర్ ఏసీబీక చిక్కారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన ప్రకారం.. పదోన్నతుల సందర్భంగా ఒక ఉపాధ్యాయురాలకు దక్కవలసిన ప్రమోషన్ మరో ఉపాధ్యాయురాలకు దక్కింది. దీంతో ప్రమోషన్ పొందని ఉపాధ్యాయురాలు ఒకే రిజర్వేషన్ ఉండి తనకన్న జూనియర్ కు ప్రమోషన్ ఎలా వచ్చిందన్న అంశంపై పూర్తి వివరాలను సేకరించి, ఈ విషయాన్ని డీఈవో రవీందర్ దృష్టికి తీసుకెళ్లింది. తాను ఇప్పుడు ఏమీ చేయలేనని కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని సూచించారు. ఆమె కోర్టు నుంచి అనుమతిని తెచ్చుకోవడంతో ప్రమోషన్ ఇవ్వడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు లక్షన్నర రూపాయలు తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు.

ప్రమోషన్ ఇచ్చిన అనంతరం సినియారిటీ విషయంలో తనకన్నా జూనియర్ తర్వాతే ఉండడం వల్ల భవిష్యత్ లో తనకు మళ్లీ నష్టం జరిగే అవకాశముందని, తన సినియారిటీని సరి చేయాలని డీఈవోకు తన భర్తతో కలిసి వెళ్లి విజ్ఞప్తి చేసింది. మళ్లీ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలన డీఈవో సూచించారు. ఆమె మళ్లీ కోర్టును ఆశ్రయించగా సినియారిటీ సరిచేయాలని కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాను డీఈవో అమలు చేయకుండా మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.50 వేలకు అంగీకరించాడు. న్యాయంగా తనకు రావలసిన ప్రమోషన్ రాకుండా, జూనియర్ కు ఇవ్వడమే కాకుండా, న్యాయస్థానం నుంచి వచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయురాలు తన భర్తతో కలిసి ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటున్న డీఈవోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version