CM Chandrababu : మహాత్ముడి బోధనలు అనుసరణీయం: సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : మహాత్ముడి బోధనలు నేటికీ అనుసరణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన నివాళి అర్పించారు. అత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
‘జై జవాన్, జై కిసాన్’ పిలుపునిచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని చంద్రబాబు తెలిపారు. ఆయన నిజాయితీ, నిరాడంరత, వ్యక్తిత్వం, త్యాగశీలత అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం గర్వించదగ్గ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.