Mahasena Rajesh : మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

Mahasena Rajesh

Mahasena Rajesh

Mahasena Rajesh : రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నాయకుడు, దళిత నేత మహాసేన రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, జనసేనకు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేయడానికి పని చేస్తోన్న నిఖార్సయిన నాయకులకు జనసేనలో చోటు లేదంటూ తేల్చి చెప్పారు.  టీడీపీకి చెందిన కొందరు నాయకులను పార్టీలోకి చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.   తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో షేర్ చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం వచ్చిందంటే… మోడీ సభలో మాట్లాడిన పవన్ కళ్యాన్  స్పీచ్ రాజేష్ కు నచ్చలేదట. అందులో ఎన్డీయే కూటమికి నాలుగు వందల సీట్లు వచ్చేందుకు తాను ప్రాణత్యాగం అయినా చేస్తానని తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే నచ్చలేదట రాజేష్ కు. ఆ మాటల్ని అడ్డం పెట్టుకుని పవన్  కళ్యాణ్ ను ఓడిస్తామని.. జనసేనకు మాత్రం ఓట్లేసే ప్రసక్తే లేదని అవసరమైతే వైఎస్సార్ సీపీకే  వేసుకుంటామన్నారు.

జనసేన నాయకులు టీడీపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మహాసేన రాజేష్ అన్నారు. అసెంబ్లీలో ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని, లోక్‌సభకు మాత్రం తమ పార్టీకి ఓటు వేయాలంటూ జనసేన నేతలు ప్రచారం చేస్తోన్నారని రాజేష్ ఆరోపించారు. రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం చూసిన తరువాత జనసేన అభ్యర్థులకు ఓటు వేయబోమని దళితులు స్పష్టం చేస్తోన్నారని అన్నారు.  పవన్ జనసేనను పట్టించుకోకపోవడం లేదని తన వీడియో ఆరంభంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తేలిపోయింది. తనను తాను జన సైనికుడిగా ప్రకటించుకున్నా.. పట్టించుకోలేదన్నారు. తాను కూటమి తరపున ప్రచారం చేస్తున్నా.. సభలు పెడుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. జనసేన వైపు నుంచి తనను గుర్తించడం లేదన్న కోపంతోనే మహాసేన రాజేష్ కోపంతో ఈ వీడియో చేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో మహాసేన రాజేష్ చేసే వీడియోలకు పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి. కానీ లాజిక్ లేకుండా.. మనసులో ఏదో పెట్టుకుని పవన్ ను విమర్శించిన  వీడియోకు మాత్రం ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ రాలేదు.

TAGS