Jagan : మహారాష్ట్రకు, జగన్ కు ఏంటి లింకు..? అక్కడి ఎన్నికలు మాజీ సీఎంకు ప్రమాదం తెచ్చిపెడతాయా..?
శివసేన, ఎన్సీపీల చీలిపోయిన వర్గాలకు పార్లమెంటులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్రను బీజేపీ గెలవలేకపోతే, ఈ పార్టీలు, వాటి ఎంపీలు తిరిగి తమ మాతృపార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉంది. లోక్ సభలో సాధారణ మెజారిటీ 272. బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే ఉన్నాయని, తన మనుగడ కోసం ప్రధానంగా టీడీపీ, జేడీయూలపైనే ఆధారపడుతోందన్నారు. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే బలం 293గా ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఏడుగురు ఎంపీలు వైదొలగితే ఆ సంఖ్య 286కు పడిపోతుంది. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రమాదకరంగా మారుతుంది. టీడీపీ, జేడీయూల్లో ఏదో ఒకటి బయటకు వస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం. మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోతే ఢిల్లీలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. పైగా,ఈ ఎన్నికల్లో బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతివ్వడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితి టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్రమాస్తుల కేసులను వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండడంతో జగన్మోహన్ రెడ్డికి ఇది మరింత ప్రమాదకరం. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వచ్చింది. జస్టిస్ సంజీవ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్ డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఓఖా ముందు రానుంది. నవంబర్ 24న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.