Pedakurapadu Constituency : రేపు పెదకూరపాడు నియోజకవర్గంలో మహా ర్యాలీ

Maha Rally in Pedakurapadu Constituency
Pedakurapadu Constituency : 11వ తేదీ శనివారం ఎన్నికల ప్రచార ముగింపు కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గంలో మహా ర్యాలీ కలదు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొంటారని పెదకూరపాడు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయం 8 గంటలకు అచ్చంపేట ఆంజనేయస్వామి విగ్రహం నుండి ప్రారంభమై బెల్లంకొండ అడ్డరోడ్డు ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొంది. ఈ ర్యాలీ అచంపేట, వేల్పూరు, క్రోసూరు, యర్రబాలెం, 88 తాళ్లూరు, గుడిపాడు, గరికపాడు, గాదెవారిపాలెం, వన్నాయపాలెం, చండ్రాజుపాలెం, చిట్యాల ఆర్ అండ్ ఆర్ సెంటర్, బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ అడ్డరోడ్డు ఆంజనేయ స్వామి గుడి వరకు నిర్వహించబడును.
కావున, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు మహార్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పెదకూరపాడు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రకటనలో కోరింది.