Social media : సోషల్ మీడియా కంటెంట్ పిచ్చి.. వంతెన పైనుంచి జారిపడి మృతి

social media

social media Reels

social media Reels : సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. అలాంటి పలు సంఘటనలు జరుగుతున్నా అవి మాత్రం ఆగడం లేదు. తాజాగా స్పెయిన్ లోని ఎత్తయిన వంతెనను ఎక్కుతుండగా బ్రిటన్ కు చెందిన ఓ ఇన్ ఫ్లుయెన్సర్ మృతి చెందాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం..

స్పెయిన్ లోని తలావెరా డి లా రీనాలోని కాస్టిల్లా- లా కేబులు బ్రిడ్జి అత్యంత పొడవైనది. 630 అడుగుల ఎత్తు ఉంటుంది. ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ (26) సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆ వంతెనను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బాధితుడు కిందపడి మృతి చెందాడు. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ వంతెనను ఎక్కడంపై నిషేధం ఉంది. అయినా పర్యాటకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అక్కడి అధికారి ఒకరు తెలిపారు.

TAGS