Manda Krishna Madiga : మే 1న పెదకూరపాడు నియోజకవర్గం మాదిగ సామాజికవర్గ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 1న బుధవారం ఉదయం 9 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఒక ప్రకటనలో కోరారు. మందకృష్ణ హాజరవుతున్న ఈ కార్యక్రమంలో మాదిగ సామాజికవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని ఆయన కోరారు.