Madhuri Dixit : మాధురి దీక్షిత్ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హిరోయిన్ గా వెలుగొందింది. కానీ ఆమె మొదటి సారి బుల్లితెర మీద రిజక్ట్ అయింది. దూరదర్శన్ లో ప్రోగ్రాం చేయడానికి వెళ్లగా.. తగినంత మంది తారాగణం లేకపోగా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మాధురి 1985 లో ఇలాంటి సంఘటన ఎదుర్కొనగా.. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
2013 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ఉత్తమమైన నటుల జాబితాలో మాధురి దీక్షిత్ నాలుగో స్థానంలో నిలిచింది. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, షారూక్ ఖాన్ తర్వాత మాధురి దీక్షిత్ అత్యంత పవర్ ఫుల్ నటిగా స్థానం దక్కించుకుంది. మాధురి దీక్షిత్ 1984 లో అదోబ్ అనే బెంగాలీ సినిమా ద్వారా అరంగ్రేటం చేసింది. ఆ సినిమా లో మాధురి అద్భుత నటన కనబరిచినా ఆ మూవీ విజయం సాధించలేకపోయింది. ఆ సినిమాలో తపస్ పాల్ అనే హిరో పక్కన నటించింది.
ఒక సంవత్సరం తర్వాత పెయింగ్ గెస్ట్ అనే సీరియల్ లో నటించింది. అందులో నీనా అనే పాత్రలో ప్రేమికుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయే పాత్రలో కనిపించింది. ప్రేమికుడితో పారిపోయి ఎక్కడో పెయింగ్ గెస్ట్ గా నివసిస్తుంది. అయితే తన లవర్ తో వచ్చి ఇక్కడ ఉంటుందని ఓనర్స్ కు తెలుస్తుందని మాధురి (నీనా) బయటపడుతుంది. అదే సమయంలో నీనా తండ్రి రూ. 50 వేల అడ్వర్టయిజ్ మెంట్ ఇచ్చి నీనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రకటన ఇస్తాడు. దీంతో నీనా భయం మరింత పెరుగుతుంది.
ఈ టెలివిజన్ షో మొత్తం 26 ఎపిసోడ్స్ గా నడించింది. అదోబ్ సినిమా కంటే ముందే బాంబై మేరీ షో అనే టెలివిజన్ షో లో మాధురి పాల్గొనగా.. ఆమెతో పాటు మిగతా యాక్టర్లు సరిగా నటించలేదని ఆ సీరియల్ ను దూరదర్శన్ చానల్ రిజక్ట్ చేసింది. ఇందులో మాధురి దీక్షిత్ కూడా ఉండడం విశేషం. అయితే అప్పటికీ మాధురి దీక్షిత్ మొదటి టీవీ సీరియల్ కావడంతో ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు. కానీ తర్వా బాలీవుడ్ ఇండస్ట్రీనే మాధురి దీక్షిత్ ఏలింది. అందుకే అపజయాలు విజయానికి తొలిమెట్లు అని అంటారు.