Maddela Cheruvu Suri murder case : మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు

Maddela Cheruvu Suri murder case
Maddela Cheruvu Suri murder case : మద్దెల చెరువు సూరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు భానుకిరణ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసు ఆయనకు బెయిల్ ఇస్తూ ఆదేశించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ కు కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో 12 సంవత్సరాలుగా చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక జీవిత ఖైదుకు సంబంధించిన కేసు విచారణను నాంపల్లి కోర్టు ధర్మాసనం ఈ నెల 14న విచారించనుంది. ఇక భాను జీవిత ఖైదుపై ఇప్పటికే సుప్రీం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 12 ఏళ్లుగా జైల్లో ఉంటున్నానని, ఇప్పటికే ఎంతో శిక్ష అనుభవించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
తాజాగా నాంపల్లి కోర్టులో భాను కిరణ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం చేపట్టింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసుల్లో భాను కిరణ్ కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.