LSG Vs CSK : లక్నో సూపర్ గెయింట్స్.. చెన్నై పోరులో ఎవరిదో పై చేయి
LSG Vs CSK : చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై, అయిదో స్థానంలో ఉన్న లక్నో రెండింటింకీ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరిగా మారింది. లక్నో మొదట్లో విజయాలతో మంచి ఊపు మీద ఉన్నా వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంతో ఒక్క సారిగా ఢీలా పడింది.
లక్నో బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్, డికాక్, పూరన్, స్టోయినిస్, దీపక్ హుడా లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నా.. వారు తమ దూకుడైన బ్యాటింగ్ ను కొనసాగించలేకపోతున్నారు. దీంతో గత రెండు మ్యాచ్ ల్లో తక్కువ స్కోరుకే పరిమితమై ఓడిపోవాల్సి వచ్చింది. బౌలింగ్ లో యయాంక్ యాదవ్ 150 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ వేయగా గాయంతో రెండు మ్యాచ్ లలో ఆడలేదు. ప్రస్తుతం నెట్స్ లో సాధన చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారీటీ లేదు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డేవన్ కాన్వే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం వల్ల స్వదేశానికి వెళ్లిపోయాడు. రచిన్ రవీంద్ర ఫామ్ అందుకోలేకపోతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్ లో అర్ధ సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. శివమ్ దూబె మంచి ఊపు మీద ఉన్నాడు. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ ల్లో 16 నుంచి 20 ఓవర్ల మధ్య డెత్ ఓవర్లలో మతీషా పతిరణ 20 వికెట్లు తీసుకుని చాలా తక్కువ ఏకానమీతో పరుగులు ఇస్తున్నాడు.
రెండు జట్లు ఇప్పటివరకు రెండు సార్లు తలపడగా.. ఒక్కో సారి విజయం సాధించాయి. చెన్నై నుంచి ముస్తాపిజర్ రెహమన్, తుషార్ దేశ్ పాండే, మతీషా పతిరణ అందరూ బౌలింగ్ లో ఫామ్ లో ఉన్నారు. లక్నో లోని అటల్ బిహరీ వాజ్ పేయి ఏకాన గ్రౌండ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది.