KKR Vs Lucknow : చేతులెత్తేసిన లక్నో బ్యాటర్లు.. దంచికొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్
KKR Vs Lucknow : ఐపీఎల్ లో సండే దమాఖాలో భాగంగా సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ లక్నో బ్యాటర్లను 161 పరుగులకే కట్టడి చేశారు. సునీల్ నరైన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు సాయంత్రం సమయంలో పిచ్ మందకొడిగా ఉండటంతో రన్స్ రావడానికి లక్నో బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. మిచెల్ స్టార్క్ మొదటి సారి 3 వికెట్లు తీసుకుని ఫామ్ లోకి రావడం కేకేఆర్‌కు ఊరటనిచ్చే విషయం.
సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 16 పరుగుల ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోర్ చేయగా.. డికాక్, స్టోయినిస్, హుడా మరో సారి తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. మధ్యలో కెప్టెన్ రాహుల్ పోరాడినా 39 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం నికోలస్ పూరన్ నాలుగు సిక్సులతో చెలరేగి 45 పరుగులు చేయగా.. 161/7 తో మొదటి ఇన్సింగ్ ను లక్నో ముగించింది.
అనంతరం 162 పరుగుల ఛేజింగ్ కు దిగిన కోల్ కతా నైడ్ రైడర్స్ ఫిల్ సాల్ట్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో 15 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. కేకేఆర్ కు బాల్స్ పరంగా ఇది మూడో అతి పెద్ద విజయం కాగా.. చెన్నై తో ఓటమి అనంతరం మళ్లీ కేకేఆర్ గెలుపు బాట పట్టింది. అయిదు మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలిచిన కేకేఆర్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి చేరుకుంది. ఈ సీజన్ లో ఈడెన్ గార్డెన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన కేకేఆర్ లక్నో పై రెండో అయ్యేస్ట్ పార్ట్నర్ షిప్ (120) పరుగులు చేసింది.
ఫిల్ సాల్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రజేంటేషన్ లో మాట్లాడుతూ.. రెండో ఇన్సింగ్ ఫ్లడ్ లైట్ వెలుతురులో పిచ్ డ్రై గా మారడంతో బ్యాటింగ్ కు అనుకూలంగా మారినట్లు చెప్పాడు. మొదటి ఇన్సింగ్స్ కంటే రెండో ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ తేలికైందన్నాడు. లక్నో కెప్టెన్ రాహుల్ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడం లేదు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం బాధ కలిగిస్తోంది. షామర్ జోసెఫ్ లాంటి యువకుడు ఐపీఎల్ నుంచి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నాడు. రాబోయే మ్యాచ్ ల్లో జట్టు పరంగా మెరుగైన ప్రదర్శన ఇస్తామన్నాడు.