LSG Vs DC : బలంగా లక్నో.. ఓటములతో ఢిల్లీ .. గెలుపెవరిది

LSG Vs DC

LSG Vs DC

LSG Vs DC : లక్నో సూపర్ జెయింట్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ రోజు సాయంత్రం జరగనున్న మ్యాచ్ ఢిల్లీ టీంకు కీలకంగా మారనుంది. ఇప్పటికే అయిదు మ్యాచుల్లో నాలుగు ఓటములతో ఢీలా పడ్డ ఢిల్లీకి మూడు విజయాలతో మంచి ఊపు మీదున్న లక్నో నుంచి గట్టి పోటీ ఎదురవునుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న మొదటి ఐపీఎల్ సీజన్ ఇది. దీంతో అతడి ఆటతీరుపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

ఢిల్లీ బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో 271 పరుగులు సమర్పించుకుని పరువు పొగోట్టుకున్నారు. ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అయితే కంటితడి పెట్టుకున్నాడు. ఇలాంటి బౌలింగ్ తో ఎలా గెలిచేదని కామెంట్ కూడా చేశారు. ఇది క్షమించరాదనదని ప్రెస్ మీట్ లో  ఢిల్లీ ఆటగాళ్లపై మండిపడ్డారు. ముంబయి తో జరిగిన మ్యాచ్ లో కూడా 236 పరుగులు ఇచ్చి ఓటమిని కొని తెచ్చుకుంది. చివరి ఓవర్లో ముంబయి ఆటగాడు రోమారియో షెపర్డ్ 30 కి పైగా పరుగులు సాధించి ఢిల్లీ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు.

ఇదిలా ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ మూడు విజయాలతో మంచి ఊపు మీద ఉంది. కేవలం ఆడిన ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయిన లక్నో.. బలహీనంగా ఉన్న ఢిల్లీ పై గెలవడం ఈజీగానే కనిపిస్తోంది. బ్యాటింగ్ లో పూరన్, డికాక్, స్టోయినిస్ లాంటి విదేశీ ఆటగాళ్లు చెలరేగుతుంటే రాహుల్ మరో పక్క వారికి తోడుగా నిలుస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. యశ్ ఠాకూర్ కూడా అయిదు వికెట్లు తీసి మంచి ఊపు మీద ఉన్నాడు.

ఢిల్లీ బ్యాటింగ్ లో వార్నర్, మార్ష్ లు బ్యాటింగ్ లో విఫలం కావడం.. బౌలింగ్ లో దక్షిణాఫ్రికా బౌలర్ నోకియా ఆఖరి ఓవర్లలో 30 కి పైగా సమర్పించుకోవడం, ఫీల్డింగ్ లో  లోపాలు సవరించుకుంటేనే లక్నో తో మ్యాచ్ లో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీకి ఒకే ఒక్క ఊరట పృథ్వీ షా ఫామ్ లోకి రావడం. మరి లక్నో ఢిల్లీ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో ఈ సాయంత్రం తేలిపోనుంది.

TAGS