Gas Cylinder:గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాల్సిందేనా?
Gas Cylinder:డిసెంబర్ 31వ తేదీలోగా గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని, లేకుంటే కొత్త సంవత్సరం నుంచి వంట గ్యాస్‌పై సబ్సిడీ అందదు,. బయోమెట్రిక్ అప్ డేట్ చేయకుంటే వంట గ్యాస్ అందుబాటులో ఉండదని పలువురు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఉన్న నిజమెంత? ..గ్యాస్ కనెక్షన్‌కు బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అప్పటి నుంచి మార్కెట్‌లో రకరకాల తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వినియోగదారులు, గ్యాస్ డీలర్లు సైతం అయోమబయానికి గురవుతున్నారు. కానీ వీటి గురించి ఎలాంటి టెన్షన్ పడకండి.
బయోమెట్రిక్ అప్‌డేట్‌కు చివరి తేదీగా కేంద్రం ఏ తేదీని ప్రకటించలేదు. బయోమెట్రిక్ గడువులోగా పూర్తి చేయాలని పంపిణీదారులను కోరారు. కానీ ఎలాంటి గడువు ఇవ్వలేదు. అంటే డిసెంబర్ 31 తరువాత కూడా మీరు మీ బయోమెట్రిక్ లను అప్‌డేట్ చేసుకోవచ్చు. అనేక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బయోమెట్రిక్ అప్ డేట్‌ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు రూ.190 రూపాయలకు గ్యాప్ పైప్‌ని ఇస్తున్నారు. అయితే బయోమెట్రిక్ కోసం వినియోగదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
గ్యాస్ పైపులు, రెగ్యులేటర్ల కొనుగోలుకు బయోమెట్రిక్‌కు ఎలాంటి సంబంధం లేదు. భద్రత అనేది పూర్తి భిన్నమైన విషయం. దీనికి బయోమెట్రిక్‌తో సంబంధం లేదు, వాటిని కొనుగోలు చేయవద్దని పంపిణీదారు మిమ్మల్ని బలవంతం చేయడానికి వీళ్లేదు. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు వసూలు చేస్తే వెంటనే వినియోగదారులు గ్యాస్ కంపెనీకి తెలియజేయండి. గ్యాస్ కంపెనీకి ఫిర్యాదు చేస్తే వారు చర్యలు తీసుకుంటారు. 18002333555 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చు.