Rains in AP : బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. క్రమంగా ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో అల్పపీడనంగా మారుతుదని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఆవర్తనం తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడనంగా మారిన తరువాత క్రమంగా పశ్చిమ దిశగా కదులుతుంది. తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరం వైపు తన దిశను మార్చుకుంటుంది.
దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్ర అంచనావేసింది.