Budvel incident : ప్రేమను ఎరగా చూపి హత్యాయత్నాలు చేయడం రాను రాను పెరిగిపోతోంది. ఒక చోట ప్రియురాలి కోపానికి ప్రియుడు బలైతే.. మరో చోట ప్రియుడి కోపానికి ప్రియురాలు బలవుతుంది. ఇదంతా మేజర్ల విషయమైతే వేరు. కానీ మైనర్లపై అఘాయిత్యాలు.. వామ్మో తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మైనర్లను ప్రేమ ముగ్గులోకి దింపుతున్న వారు వారిపై అఘాయిత్యం చేయడమే కాకుండా.. హత్యయత్నం కూడా చేస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దారుణం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికను ప్రేమ పేరుతో విఘ్నేష్ అనే వ్యక్తి ముగ్గులోకి దించాడు. తీరా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని కోరడంతో విఘ్నేష్ లోని నీచుడు బటయకు వచ్చాడు.
ఆమెను తను చెప్పిన చోటుకు రమ్మని నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను పోలీసులు కడప రిమ్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు దీనికి సంబంధించి వీడియోను లీకైంది. ఇందులో ఆమె విఘ్నేష్ తనను ప్రేమించాడని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, మనం పెళ్లి చేసుకుందాం అని కోరడంతో నన్ను ఫలానా ప్రదేశానికి రమ్మని అక్కడ నా డ్రెస్ కు నిప్పంటించాడని ఆమె వివరించింది. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిందితుడికి వేగంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించాడు.