Damini About Rathika Love : రాహుల్ రతికా ప్రేమాయణం మొత్తం చెప్పేసిన సింగర్ దామిని.. అన్ని ట్విస్టులు ఉన్నాయా?
Damini About Rathika Love : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా జరుగుతుంది. ప్రతీ సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.. అయితే ఈసారి సీజన్ లో అందరి కంటే ఎక్కువుగా క్రేజ్ తెచ్చుకుంది పల్లవి ప్రశాంత్ అయితే అత్యంత నెగిటివిటీ తెచ్చుకుంది మాత్రం రతికా రోజ్ అనే చెప్పాలి..
ఈమె పిఆర్ టీమ్ ను సెట్ చేసుకుని మరీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి రోజు నుండి ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళుతుంది. హౌస్ లో లవ్ ట్రాక్ నడపాలి అనేది కూడా ఈమె ప్లాన్ లో భాగమే.. ముందుగా పల్లవి ప్రశాంత్ తో మంచిగా ఉన్నట్టు నటించి లవ్ ట్రాక్ పెట్టుకోవాలని చూసింది.
కానీ ఆ తర్వాత ఒక్కసారిగా రివర్స్ అయ్యి యావర్ ను ట్రాక్ లో పెట్టాలని చూసింది.. అంతేకాదు ఈ భామ హౌస్ లో సింగర్ సిప్లిగంజ్ తో ఎఫైర్ కూడా బయట పెట్టింది. రాహుల్ తో ప్రేమాయణం కూడా ఈ హౌస్ లో వాడుకోవాలని చూసింది. అందుకే అతడితో లవ్ ట్రాక్ తన పిఆర్ టీమ్ ద్వారా బయట పెట్టించి సింపతీ గేమ్ ఆడాలని ప్రయతించింది.
మాజీ లవర్ ను ఇప్పటికి మిస్ అవుతున్నాను అంటూ మొసలి కన్నీరు కార్చింది.. బిగ్ బాస్ లో డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా హౌస్ మేట్స్ తో మాత్రం రాహుల్ గురించి మాట్లాడేదట.. దీనిపై రాహుల్ సీరియస్ అయ్యాడు.. తన గేమ్ ను నమ్ముకోకుండా ఇతరుల ఫేమ్ తో పైకి రావాలని చూస్తుంది అంటూ చెప్పడంతో ఇదంతా ఈ భామకు బాగా నెగిటివిటీ పెరగడానికి కారణం అయ్యింది.
ఇదిలా ఉండగా తాజాగా సింగర్ దామిని రాహుల్, రతికల ప్రేమ వ్యవహారంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె ఎలిమినేట్ అయ్యాక రాహుల్ ఫోన్ చేసి రతికా గురించి అన్ని విషయాలు చెప్పారట.. వారు గతంలో డేటింగ్ చేసిన విషయం నిజమే కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారట..
బిగ్ బాస్ లో రతికా తనకు రాహుల్ గురించి చెప్పగా అది స్ట్రాటజీలో భాగంగా అనుకోలేదని నేను ఎలిమినేట్ కావాల్సింది కాదు.. రాతికను ఇంట్లోకి తెచ్చేందుకు నన్ను, శుభశ్రీని బిగ్ బాస్ వాడుకున్నాడని ఆమె చెప్పుకొచ్చింది..