JAISW News Telugu

Nivetha Pethuraj : ప్రేమించి మోసపోయా.. నా ఫ్రెండే నా లవర్‌తో అలా చేసింది.. నివేత పేతురేజ్ షాకింగ్ విషయాలు

Nivetha Pethuraj

Nivetha Pethuraj

Nivetha Pethuraj : చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం.. నటనలో విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నివేత పేతురేజ్. కొలీవుడ్ నుంచి కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది.. మెల్లి మెల్లిగా టాలీవుడ్ వైపునకు వచ్చింది. చాలా కాలంగా మంచి మంచి చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పేతురాజ్ తన బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది..? దానికి సంబంధించిన వివరాలను చూడండి.

అలా ఎంట్రీ..
నివేదా పేతురాజ్ 2016లో వచ్చిన ‘ఓరు నాల్ కోత్తు’ అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. అదే భాషలో ‘పొద్వుగ ఎన్ మనస్సు తంగం’ అనే సినిమా చేసి ఫేమస్ అయింది. 2017లో వచ్చిన ‘మెంటల్ మది’లో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటరై గుర్తింపు సంపాదించుకుంది.  

తెలుగులో వరుస హిట్లు
టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలోనే ఓ రేంజ్‌లో పాపులర్ అయిన నివేదా పేతురాజ్.. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురములో’, ‘రెడ్’ సినిమాల్లో నటించింది. ఇవన్నీ భారీ విజయాలనే సొంతం చేసుకున్నాయి. దీంతో టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ, ఆఫర్లు మాత్రం అనుకున్నట్లు రాలేదు.

ఆ సినిమాలతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్‌ సంపాదించుకున్న నివేదా పేతురాజ్.. విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ సినిమాలో నటించింది. గతేడాది ‘దాస్ కా ధమ్కీ’లో మరోసారి అతడితో నటించి హిట్‌ కొట్టింది. ఆ తర్వాత నివేదా ‘భూ’ అనే సినిమా చేసింది. ఇక, ఇప్పుడు ఈ అమ్మడు ‘పార్టీ’ అనే తమిళ చిత్రాన్ని చేస్తోంది.

ఆ వీడియోతో సెన్సేషన్
నివేదా పేరురాజ్‌కు అందంతో పాటు టాలెంట్ ఉన్నా అవకాశాలు మాత్రం దక్క లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దీనికోసం ఓ ప్రమోషనల్ వీడియో చేసింది. ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకొని సక్సెస్ సాధించింది.

ప్రేమలో మోసపోయా..
మంచి ఆఫర్లతో సత్తా చాటుతున్న నివేదా పేతురాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. ‘నేను ప్రేమించి మోసపోయాను. కాబట్టి నేను ఏం చేప్తానంటే ఎవరూ తొందడపడి ప్రేమలో పడద్దు. పడినా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండే నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ అనుభవంతోనే చెప్తున్నాను’ అని చెప్పింది. 

Exit mobile version