Looming threat ఫ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఒడిసాతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈరోజు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి, మన్యం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఒడిసాలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో నిన్న తేలికపాటి వానలు పడ్డాయి. రాబోయే 24 గంటల వ్యవధితో రాయలసీమ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.