Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవ్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ

Sajjala Bhargav Reddy
Sajjala Bhargav Reddy : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వైఎస్సార్ జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న పులివెందులలో వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఏపీలో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.