Trump and Biden : ట్రంప్- బైడైన్ మధ్య యుద్ధంపై సుధీర్ఘ చర్చలు.. !

Trump and Biden

Trump and Biden

Trump and Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్ లోని  ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు జో బిడెన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అమెరికా సంప్రదాయం ప్రకారం అధికారాన్ని సజావుగా బదిలీ చేయాలని ఇద్దరు నేతలు సంకల్పించారు. ఈ సంక్షిప్త సమావేశంలో, జనవరి 20, 2025న దేశానికి శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతుందని ఇరువురు నేతలూ హామీ ఇచ్చారు.

అధ్యక్షుడు జో బిడెన్ ట్రంప్‌నకు స్వాగతం పలికారు.  ట్రంప్‌ విజయం సాధించినందుకు బిడెన్‌ అభినందనలు తెలుపుతూ, సజావుగా అధికార మార్పిడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

శాంతియుతంగా అధికార మార్పిడిలో ఇరువురు నేతల సమావేశం సంప్రదాయంగా సాగుతోంది. అయితే నాలుగేళ్ల క్రితం ట్రంప్ స్వయంగా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. ట్రంప్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ సభ్యులను కలవాలని యోచిస్తున్నారు. వారు తన ప్రధాన ప్రాధాన్యతలపై దృష్టి సారించారు   దేశ రాజధానిలో రిపబ్లికన్ విజయంతో సాధ్యమైన ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇదే సమయంలో ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంపై తాను, అధ్యక్షుడు జోబైడెన్‌తో చర్చించినట్లు ట్రంప్‌ వెల్లడించడం విశేషం. ఈ భేటీలో తొలుత బందీల విడుదల ఒప్పదం కుదిరేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ట్రాన్సిషన్‌ టీమ్‌కు సంకేతాలు పంపినట్లు  అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సులివాన్‌  వెల్లడించారు. తమ కార్యవర్గం చివరి రోజు వరకు హమాస్‌ నుంచి బందీలను విడుదల చేసేందుకు పనిచేస్తుందని స్పష్టం చేశారు.
TAGS