Lokesh : విజయవంతంగా పూర్తయిన లోకేశ్ అమెరికా పర్యటన..

Lokesh

Lokesh

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ కొన్ని రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నారు. చివరి రోజు లాస్‌వెగాస్‌లో ఐటీ సర్వ్‌ సినర్జీ2024 సమ్మిట్‌లో విశిష్ట అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. అమేజాన్‌ వెబ్‌ సర్వీసెస్ యండీ రేచల్‌, రెవేచర్‌ సీఈవో అశ్వినీ భరత్‌, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయీ, సేల్స్‌ ఫోర్స్‌ ఏఐ సీఈవో క్లారా షియా, తదితరులతో సమావేశం అయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో మీ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను మంత్రి లోకేశ్ కోరారు. ఏపీలో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించాలని రెవేచర్ సీఈవోకు విన్నవించారు.

అంతకుముందు మైక్రోసాఫ్ట్, యాపిల్‌, అడోబ్, తదితర సంస్థల ప్రతినిధులను కలిశారు లోకేశ్. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమై.. రాష్ట్రాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహకరించాలని కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా రూపొందిస్తామని, ఏఐ యూనివర్సిటీకి పెట్టుబడులు పెట్టాలని సత్యనాదెళ్లను కోరారు. డిజిటల్ గవర్నెన్స్ విధానాల్లో మైక్రోసాఫ్ట్ సహకరించాలని విన్నవించారు. సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించినట్లు మంత్రి లోకేశ్‌ చెప్పారు.

అడోబ్ CEO శంతను నారాయణ్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో కలిశారు. ఏపీకి పెట్టుబడులతో రావాలని కోరారు. యాపిల్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి, వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంను కలిశారు లోకేష్. సంస్థ కార్యకలాపాలను ఏపీలో విస్తరించాలని కోరారు.

ఎలక్ట్రిక్ వాహనాల అగ్రగామి సంస్థ టెస్లా ఆఫీస్ ను సందర్శించిన లోకేశ్.. ఆ కంపెనీ సీఎఫ్ఓ వైభవ్‌తో సమావేశం అయ్యారు. డల్లస్ లో పెరోట్ గ్రూప్ చైర్మన్‌ను కలిసి మాట్లాడారు. లోకేశ్ అమెరికా పర్యటన ఏపీ అభివృద్ధి.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కొనసాగింది. త్వరలో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతాయన్నారు టీడీపీ నేతలు..

TAGS