Nara Lokesh : సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్..

Nara Lokesh
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ సింహాద్రి అప్పన్న స్వామిని ద ర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన లోకేష్‌కు అధికా రులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న లోకేష్ బేడ మండపం వద్ద ప్రదక్షిణ చేశారు.
అనంతరం లోకేష్ అంతరాలయంలోని స్వామిని దర్శించుకున్నారు. లోకేష్ పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం అనంతరం అధికారులు లోకేష్‌కు స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. లోకేష్‌తోపాటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, పల్లా శ్రీనివాస్, అదితి గజపతి, పీవీ నరసింహం టీడీపీ నాయకులు కూడా స్వామివారిని దర్శించు కున్నారు.
కాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురం, భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిట్టివలస, విజయనగరం జిల్లా సోంపురంలో శనివారం లోకేష్ శంఖారావం యాత్ర నిర్వహించారు.