Lokesh Kanagaraj:ఖైదీ (ఖైథీ)- విక్రమ్ – మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు లోకేష్ కనగరాజ్. ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కమల్ హాసన్ కెరీర్ కి విక్రమ్ లాంటి బెస్ట్ మూవీని ఇచ్చిన ఘనత అతడిదే. విక్రమ్ కి చేసిన పనికి దర్శకుడు విస్తృతమైన ప్రశంసలు పొందారు. అలాగే విజయ్ నటించిన తన ఇటీవలి ప్రాజెక్ట్ లియో విషయంలో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.
అయితే లియో విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? అన్నదానిపై అతడు స్వయంగా వివరణ ఇచ్చాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో కనగరాజ్ మాట్లాడుతూ.. లియో రెండవ సగంలో లోటుపాట్లకు కారణమైన సమస్యలను వెల్లడించాడు. షూటింగ్ ప్రారంభంలో భవిష్యత్ ప్రాజెక్ట్‌ల కోసం విడుదల తేదీలను ప్రకటించకూడదని తన నిర్ణయాన్ని కూడా తెలిపాడు. ముందుగా విడుదల తేదీ ప్రకటన కారణంగా లియో పెండింగ్ పనిని పూర్తి చేయాలనే ఒత్తిడి పని చేసిందని తన అనుభవాన్ని విశ్లేషించాడు. ఇకపై రిలీజ్ తేదీ విషయంలో డెడ్ లైన్లతో పని చేయనని అన్నాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రేపు తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న తమిళ చిత్రం `ఫైట్ క్లబ్`కు లోకేష్ సమర్పకుడి పాత్రను తీసుకున్నారు. అబ్బాస్ ఎ రహమత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ కుమార్, కార్తికేయన్ సంతానం, శంకర్ థాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.