JAISW News Telugu

Nara Lokesh : అమెరికా పోలీసుల కస్టడీలో లోకేశ్.. ఇందులో నిజమెంత?

Lokesh in the custody of American police

Lokesh in the custody of American police??

Nara Lokesh : ఈ మధ్య నారా లోకేశ్ పెద్దగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో సైతం లోకేశ్ యాక్టివిటీస్ తగ్గాయి. ఆయన ఏమైనా విదేశీ పర్యటనలో ఉన్నారా? లేకుంటే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా అంతర్గత చర్చల్లో నిమగ్నమయ్యారా? అన్నది మాత్రం తెలియడం లేదు.

కానీ ఆయన యూఎస్ టూర్ వెళ్లారని.. ఎన్నికలకు సంబంధించిన నిధుల సేకరణ పనిలో పడ్డారని.. ఈక్రమంలో అక్కడి పోలీసులకు పట్టుబడ్డారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలియదు కానీ.. వైసీపీ శ్రేణులు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నాయి.

యువగళం పాదయాత్ర ముగింపు తర్వాత లోకేశ్ పెద్దగా కనిపించడం లేదు. అటు చంద్రబాబు ‘రా కదిలిరా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో లోకేశ్ రాజకీయ కార్యక్రమాలేవీ చేయడం లేదు.

దీంతో ఆయన అంతర్గత చర్చలు, వ్యూహాలకు పరిమితం అవుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల పూర్తిగా కనపడకపోయే సరికి లేనిపోని ప్రచారం ప్రారంభమైంది. యూఎస్ లో నిధుల సమీకరణలో భాగంగా.. హవాలా తరహాలో నగదును ఏపీకి తెచ్చే క్రమంలో యూఎస్ పోలీసులు లోకేశ్ ను కస్టడీలోకి తీసుకున్నారని ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయాన్ని బాగా ట్రోల్ చేస్తోంది.

వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం. ముఖ్యంగా టీడీపీకి జీవన్మరణ సమస్య. అధికార వైసీపీకి పుష్కలంగా నిధులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ధన ప్రవాహంతో ఆ పార్టీ గెలవాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి. దానితో పోల్చుకుంటే టీడీపీకి నిధుల సమస్య ఉంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే లోకేశ్ యూఎస్ వెళ్లి అడ్డంగా బుక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు.

అయితే ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట లోకేశ్ ను అభాసుపాలు చేయడానికే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారని..ఇప్పటికే చంద్రబాబు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తుండడంతో.. క్షేత్రస్థాయిలో నెట్ వర్క్ నడుపుతున్నారని అంటున్నారు. ఇది చూసి తట్టుకోలేక వైసీపీ విష ప్రచారానికి దిగిందని ఆరోపిస్తున్నారు.

Exit mobile version