JAISW News Telugu

lok sabha:లోక్‌స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం..ఆ బాధ్య‌త నాదే అన్న స్పీక‌ర్‌

lok sabha:పార్ల‌మెంట్ స‌మావేశాల వేళ లోక్‌స‌భ‌లోకి ఇద్ద‌రు దుండ‌గులు దూసుకొచ్చిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై స్పీక‌ర్ ఓం బిర్లా స్పందించారు. ఘ‌ట‌న‌పై సమ‌గ్ర ద‌ర్యాప్త చేప‌డ‌తామ‌ని, ఈ ఘ‌ట‌న‌పైపూర్తి బాధ్య‌త త‌న‌దేన‌ని హామీ ఇచ్చారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్నిలేవ‌నెత్తారు. భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా దీనిపై చ‌ర్చించాలని ప‌ట్టుబ‌ట్టారు.

దీనిపై స్పీక‌ర్ ఓం బిర్లా స్పందించారు. `లోక‌స‌భ లోప‌ల ఇద్ద‌రు దుండ‌గులు, బ‌య‌ట మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నాం. వారి వ‌ద్ద ఉన్న వ‌స్తువుల‌ని స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌డ‌తాం. ఆ పూర్తి బాధ్య‌త నాదే. నిందితులు వ‌దిలింది కేవ‌లం సాధార‌ణ పొగే అని ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. అయితే నిందితులు వ‌దిలిన గ్యాస్ ఏమిట‌నే దానిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపుతాం.

దీనిపై ఈ సాయంత్రం స‌మావేశం నిర్వ‌హిస్తాం. స‌భ్యుల ఆందోళ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాం` అని వెల్ల‌డించారు. ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా స‌రే స‌భ‌ను సావుగా న‌డిపించ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని స్పీక‌ర్ ఓం బిర్లా స్ప‌ష్టం చేశారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో లోక్‌స‌భ‌లో దుండ‌గులు క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే.

Exit mobile version