Veerappan Daughter : వీరప్పన్ కుమార్తె విద్యా రాణి వీరప్పన్ లోక్ సభ ఎన్నికల్లో కృష్ణగిరి లోక్ సభ స్థానానికి నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఈ రోజు (మార్చి 25) నామినేషన్ దాఖలు చేసింది.
2024, మార్చి 25వ తేదీ సోమవారం విద్య నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ మాజీ సభ్యురాలైన ఆమె పార్టీ ఓబీసీ విభాగానికి ఆఫీస్ బేరర్ గా ఉన్నప్పటికీ ఇటీవలే పార్టీని వీడి ఎన్టీకేలో చేరారు. మార్చి 23, శనివారం ఆమెను కృష్ణగిరి నియోజకవర్గానికి ఎన్టీకే అభ్యర్థిగా ప్రకటించారు. కృష్ణగిరికి చెందిన విద్యా రాణి బీజేపీలో చేరడానికి ముందు పీఎంకేలో ఉన్నారు.
33 ఏళ్ల విద్యరాణి న్యాయవాదిగా శిక్షణ పొంది కృష్ణగిరిలో ఒక పాఠశాలను నడుపుతూ అక్కడే జీవిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కే గోపీనాథ్, బీజేపీ అభ్యర్థి సీ నరసింహన్, అన్నాడీఎంకే అభ్యర్థి వీ జయప్రకాశ్ తో ఆమె ఈ సారి తలపడనుంది.
గంధపు చెక్కల స్మగ్లర్ అయిన తన తండ్రిని 2004, అక్టోబర్ లో తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో హతం అయ్యాడు. రెండు దశాబ్దాల తర్వాత విద్యా ఎన్నికల బరిలోకి దిగడం గమనార్హం.
విద్య రాణిని గెలిపిస్తే రైతు సంక్షేమం, నీటి యాజమాన్యం, మారుమూల కొండల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, నాణ్యమైన విద్య, ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. తాను గెలుస్తానని ఆమె ధీమాగా ఉంది. అయితే బీజేపీ నుంచి గట్టి పోటీ వచ్చే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.