Lok Sabha Elections : దేశం యావత్తు ఆత్రుతగా ఎదురుచూసే ఎన్నికలకు ఒక్కొక్కటిగా సిద్ధం అవుతోంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొంత మంది పార్లమెంట్ సభ్యులు వారి అభిప్రాయాలను వెలువరుస్తు్న్నారు. వారు విశ్వసనీయంగా చెప్తున్న విషయం ఏంటంటే దాదాపు మార్చి 15వ తేదీ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. పోలింగ్ షెడ్యూల్ లో భాగంగా ఏప్రిల్ మూడో వారంలో తెలంగాణ లోక్‌సభకు సంబంధించి ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
దేశంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ ఒంటరిగా బీజేపీకి 370, ఎన్డీయేకు 400 సీట్లు గ్యారంటీ అని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ‘ఆప్ కీ బార్ 400 పార్’ అంటూ నినాదం చేశారు. స్వయానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే స్లోగన్ పార్లమెంట్ లో చెప్పడంతో దీనిపై దేశంలో సర్వత్రా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించిన I.N.D.I.A కకా వికలం అవుతోంది. అందులో నుంచి కేజ్రీవాల్, మమతా, నితిన్ బయటకు వెళ్లారు. ఇక కొంత మందితో అలియన్స్ లో ఉన్న I.N.D.I.A ఎన్నికల వరకు పూర్తిగా విచ్ఛిన్నం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టే ప్రధాని మోడీ ఆప్ కీ బార్ 400 పార్ అంటూ స్లోగన్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక ఉత్తరంతో పాటు దక్షిణాదిన కూడా బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లను దక్కించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా పోటీలోకి దిగకుండానే గెలుపు కన్ఫం చేసిన బీజేపీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చన్న వారు కూడా లేకపోలేదు.