MP Candidates List : ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

AP Congress MP Candidates List
MP Candidates List : ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులు, ఝార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. శ్రీకాకుళం – డా. పరమేశ్వరరావు, విజయనగరం-బొబ్బిలి శ్రీను, అమలాపురం-జంగా గౌతమ్, మచిలీపట్నం-గొల్లు కృష్ణ, విజయవాడ-వల్లూరు భార్గవ్, ఒంగోలు-సుధాకర్ రెడ్డి, నంద్యాల-లక్ష్మినరసింహ యాదవ్, అనంతపురం-మల్లికార్జున్, హిందూపురం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా సమద్ షాహీన్ ను ఏఐసీసీ ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల దూసుకుపోతున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలపై ఆమె విమర్శలు కురిపిస్తున్నారు. రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ షర్మిల రాకతో పూర్వ వైభవం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు వైఎస్ షర్మిల తీవ్రంగా కృషి చేస్తున్నారు.