Liquor Sucking Money : డబ్బును జలగలా పీలుస్తున్న మద్యం.. రోజుకు అదనంగా కోటి!
Liquor Sucking Money : ఇటీవల వినిపించిన పదం ‘మద్యం రేట్ల రేషనలైజేషన్’. దీనిలో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించి రేట్లను పెంచడం, మరొకొన్నింటి రేట్లను తగ్గించడం వెనుక భారీ గోల్ మాల్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. స్టాక్ క్లియర్ చేసుకునే నేపథ్యంలో కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై మద్యం వ్యాపారాన్ని డీల్ చేస్తున్న వాసుదేవరెడ్డి ఫ్యాక్ట్ చెక్ తో తెర ముందుకు వచ్చారు.
ఆయన ఏమన్నారంటే.. స్టాక్ క్లియరెన్స్ కోసం బ్రాండ్లు ధరలు తగ్గించడం కాదని, ఆదాయం ఊహించని రేంజ్ లో రూ. కోటి పెరిగిందని చెప్పుకొచ్చారు. అంటే మద్యం ప్రియుల నుంచి రోజుకు రూ. కోటి అదనంగా వసూలు చేస్తున్నారన్నమాట. వాసుదేవరెడ్డి చెప్పిన విషయాలను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అసలు విషయాలు దాచి.. కొన్ని మాత్రమే చెబుతూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. భారీ స్కాం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఏపీలో మద్యం మద్యం ప్రియుల ఆరోగ్యం, ఆస్తులు తమ సొంతం అన్నట్లుగా ప్రభుత్వం తీరు చూస్తుంటే అర్థమవుతుంది. అడ్డూ, అదుపూ లేకుండా బ్రాండ్లను, నకిలీ మద్యాన్ని అమ్ముతూ అడ్డగోలు దోపిడీకి చేస్తుంది. వేలాది కోట్లు వెనకేసింది. దీంతో వేలాది మంది అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడుతున్నారు. ఇటు తాగి కొంచెం ఆస్తి కరిగించుకుంటే.. రోగాలతో పూర్తి ఆస్తులు కరిగిపోతుయన్న విమర్శలను జగన్ ప్రభుత్వం మోస్తోంది. ఇప్పటికైనా మద్యం పాలసీ, విధి విధానాల గురించి పట్టించుకోవాలని అక్కడి ప్రజలు సీఎంను కోరుతున్నారు.