Liquor Seized : సర్పంచ్ వాహనంలో మద్యం పట్టివేత

Liquor seized in Sarpanch’s vehicle
Liquor Seized : గ్రామ సర్పంచ్ వాహనంలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద నున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ లో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామం వైసీపీ సర్పంచ్ సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్ బాబు 1,056 మద్యం సీసాలను కొనుగోలు చేసి వాహనంలో తరలిస్తున్నారు.
కొండమోడు సమీపంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారి కల్పశ్రీ, కొందరు అధికారులు వాహనాన్ని తనిఖీ చేయగా మద్యం బాటిల్లు లభ్యమయ్యాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 1.58 లక్షలు ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీకు తీసుకు వెళ్తున్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పిడుగురాళ్ల ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు.