Liquor new policy : ఏపీలో మద్యం ధరల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఏపీలోని కూటమి సర్కార్ మద్యం పాలసీకి సంబంధించి లిక్కర్ షాపులను ఆయా వ్యక్తులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. నూతన మద్యం పాలసీ ప్రకారం ఏపీలో ఒక కింగ్ ఫిషర్ బీరు 200 రూపాయల నుంచి 220 వరకు ఉంది. అదే స్ట్రాంగ్ బీర్ తెలంగాణలో 150 రూపాయలు ఉంది.
ఒకవేళ దాని బ్లాక్ లో కొనాలి అంటే 120 రూపాయలు ఎక్కువ అవుతుంది. కానీ ఏపీలో మాత్రం దీని ధర ఏకంగా 200 వరకు ఉండడం విశేషం. ఏపీకి తెలంగాణకు ఒక బీరు విషయంలోనే దాదాపు 50 నుంచి 60 రూపాయల మధ్య తేడా ఉండడం గమనించవచ్చు. ఏపీలో మొన్నటి వరకు అన్ని నకిలీ బ్రాండ్ మద్యం దొరికాయని చాలామంది విమర్శలు చేశారు. బ్లాక్ బస్టర్ అని ఇలా అనేక రకాల విచిత్రమైన పేర్లు ఉన్న బ్రాండ్లను గత వైసిపి సర్కార్ అమ్మింది. కాగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏపీలో నూతన లిక్కర్ పాలసీని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఏమి అవసరం ఉన్నాయో అలాంటి మందుని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కింగ్ ఫిషర్ బీర్లు మిగతా విస్కీ బాటిల్స్ వచ్చాయి.
తద్వారా యువకులు, మందుబాబులు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ పాత రకం మద్యాన్ని తాగుతున్నామని అనుకుంటున్నారు. అదే విధంగా వీటి రేట్లను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా బీరు 200 రూపాయలు ఉండటం విస్కీ కి ₹100 ఎక్స్ట్రా గా ఉండడం ఇలాంటివి వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయినప్పటికీ మందు తాగడం మాత్రం ఆపేసేది లేదని చెబుతున్నారు. మొత్తం మీద ఐదు సంవత్సరాలు తర్వాత మందుబాబులకు ఇష్టమైన మందు దొరికే అవకాశం ఉండడంతో రేటుని ఏమాత్రం చూసుకోకుండా కొనేస్తున్నారు.మందు దొరికిన వెంటనే ఎంతో సంబరపడిపోతున్నారు.