Lions on Railway Track : రైల్వేట్రాక్ పై సింహాలు.. లోకోపైలట్ అప్రమత్తం
Lions on Railway Track : రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ట్రాక్ పైకి ఒకేసారి పది సింహాలు రావడంతో అప్పమత్తమైన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో సింహాలకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన గుజరాత్ లోని పిపావావ్ పోర్టు సమీపంలో చోటుచేసుకుంది.
గుజరాత్ లోని పిపావావ్ పోర్టు స్టేషన్ నుంచి గూడ్స్ రైలు వెళ్తుండగా ట్రాక్ పై 10 సింహాలు సేదతీరుతున్నట్లు లోకోపైలట్ ముకేశ్ కుమార్ మీనా గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. అవి పట్టాల నుంచి లేచి దూరంగా వెళ్లాక రైలును కదిలించాడు. అయితే, లోకోపైలెట్ మీనా చేసిన ఈ పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభించాయని వెస్టర్న్ రైల్వే భావ్ నగర్ డివిజన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఉత్తర గుజరాత్-పిపావావ్ పోర్టు మార్గంలో నైల్వే లైనులో కొన్నేళ్లుగా అనేక సింహాలు మృతి చెందుతున్నాయి. గిర్ అభయారణ్యానికి ఈ ప్రాంతం చాలా దూరంలోనే ఉన్నప్పటికీ ఇక్కడ తరచూ సింహాలు సంచరిస్తుంటాయి. దీంతో ట్రాక్ మార్గంలో అటవీ శాఖ కంచెలను కూడా ఏర్పాటు చేసింది. కాగా, గుజరాత్ లో దాదాపు 674 ఆసయా సింహాలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.