JAISW News Telugu

CM Revanth Reddy : రేవంత్ మార్క్ ప్రక్షాళన మొదలైనట్లేనా?

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇక ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. ఇక పరిపాలనపై పట్టు బిగించాలని రేవంత్ భావిస్తున్నారు. తన మార్కు పాలనకు  పెద్ద  సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ లను మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న పలువురు ముఖ్య అధికారులను మార్చాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన  డీజీపీని మరొకరిని నియమించాలని భావిస్తున్నారు. కొత్త డీజీపీని  రేవంత్ ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. మరి కొంత మంది ఉన్నతాధికిరాుల మార్పు ఖాయమని తెలుస్తున్నది.

ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై దృష్టి..
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరగనున్నాయి. సామాజిక న్యాయంతో పాటుగా సిన్సియారిటీకి ప్రాధాన్యమిస్తూ సీనియర్ ఐపీఎస్ ల బదిలీలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రానికి మరో రెండు డీజీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది ప్రస్తుతం రాష్ట్రంలో రవి గుప్తా, అంజనీ కుమార్, సీవీ ఆనంద్, జితేందర్  డీజి హోదాలో కొనసాగుతున్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ ఇటీవల చనిపోయరు. సందీప్ శాండిల్య రిటైర్డ్ అయ్యారు. జితేందర్ కు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖల బాధ్యతలు అప్పగించారు.

డీజీపీగా ఛాన్స్ అతడికేనా?
తాజాగా డీజీ హోదాలో చోటుచేసుకున్న మార్పులతో 1994 బ్యాచ్ ఐపీఎస్ లో ఇద్దరిలో ఒకరికి డీజీ ర్యాంక్ దక్కే అవకాశాలు ఉన్నాయి.  1994 బ్యాచ్ కు చెందిన అదనపు డీజీలు శివధర్ రెడ్డి, శిఖా గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, వినాయక ప్రభాకర్ ఆప్టేలలో ఇద్దరికి డీజే రాంక్ దక్కే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఆప్టే కేంద్ర సర్వీస్ లో పని చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డిలకు డీజే ర్యాంక్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ సమీకరణలతో ప్రస్తుత ఐబీ చీఫ్  ఉన్న శివధర్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా, ఎస్ బీ చీఫ్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎంపిక దాదాపు ఖాయమనే  చర్చ  పోలీస్ ఉన్నత స్థాయి వర్గాల్లో సాగుతున్నది.

సమూల ప్రక్షాళన
రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతన్నది. ముఖ్యంగా హైదరాబాద్ ఏసీపీలు, ట్రాఫిక్ కమిషనర్ వంటి ఖాళీలను సమర్ధులైన అధికారులతో భర్తీ చేయాలని చూస్తున్నారు. పోలీస్ కమిషనరేట్లు, జిల్లాలోనూ పెద్ద ఎత్తున పోలీస్ అధికారుల బదిలీలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో పాటుగా రాష్ట్రంలో 9 పోలీస్ కమిషనరేట్లలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. బదిలీలు, మార్పులు-చేర్పుల నేపథ్యంలో కొత్త డీజీపీగా ఎవరు నియమితులు కాబోతున్నారనే  చర్చ అధికార వర్గాల్లో జోరందుకుంది.

Exit mobile version