JAISW News Telugu

Ananya Panday : లైగర్ బ్యూటీ లగ్జరీ కారు.. నెంబర్ స్పెషాలిటీ తెలుసా? ఆ నెంబర్ కోసం ఏం చేసిందంటే?

Ananya Panday

Ananya Panday : విజయ్ దేవరకొండ డిజాస్టర్ మూవీ లైగర్ గురించి చెప్పక్కర్లేదు కదా.. అందులో విజయ్ కి జంటగా నటించిన హీరోయిన్ అనన్య పాండే. ఈ అమ్మడి పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. సినిమాల్లో అంత సక్సెస్ రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటుంది. రీసెంట్‌గా ఇన్‌ స్టాలో హార్ఢిక్ పాండ్యాను ఫాలో అవడంతో వార్తల్లో నిలిచింది. దీన్ని పక్కన పెడితే ఈ బ్యూటీ ఇప్పుడు ఒక లెగ్జరీ కారు కొంది అదేంటంటే రేంజ్ రోవర్.  దీని ధర రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారుపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. కారణం నెంబర్ ప్లేట్.

అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని మూవీస్ లో చేసింది. కానీ ఏవీ అమ్మడికి కలిసి రాలేదు. కానీ,  గ్లామరస్ బ్యూటీగా మాత్రం క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ తన లెగ్జరీ కారుతో సందడి చేస్తోంది. ఆమె కొన్న కారు ధర అక్షరాల రూ.3.38 కోట్లు. అనన్య పాండేకు ఇప్పటి వరకు చాలానే కార్లు ఉన్నాయి. వీటికి తోడు మరోటి తీసుకొంది. ఆమె కొత్త కారు నెం. 3000. ఈ నెంబర్ ను ఆమె ప్రత్యేకంగా రిజర్వ్ చేయించుకుందట. ఎందుకంటే అనన్య పుట్టినరోజు అక్టోబర్ 30. అందుకే 30(00) కొనుగోలు చేసి ఉండచ్చని కొందరు భావిస్తున్నారు.

హాలీవుడ్ మార్వెల్ సినిమాలోని బోరో లైన్ కోసం ఈ నెంబర్ ప్లేట్ ను ఆమె తీసుకొని ఉంటుందని కూడా టాక్ ఉంది. మార్వెల్ మూవీలో ‘ఐ లవ్ యూ 3000 టైమ్స్’ అనే డైలాగ్ ఉంటుంది. ఎవెంజర్స్: ఎండ్ గేమ్ లో కూడా ఐరెన్ మ్యాన్ ఈ డైలాగ్ నే వాడుతాడు. అనన్య కూడా మార్వెల్ లవర్ కాబట్టి ఈ నెంబర్ తీసుకొని ఉంటుందని చర్చ నడుస్తోంది. ఇటీవల, అనన్య పాండే అంబానీ ఇంట వివాహానికి వెళ్లింది. ఈ వివాహ క్రతువులో ఆమె హార్థిక్ పాండ్యాతో కలిసి కనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ ఇన్‌ స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version