JAISW News Telugu

Notice to Nayanthara Husband : నయనతార భర్తకు చుక్కలు చూపిస్తున్న LIC అధికారులు..త్వరలోనే అరెస్ట్?

Notice to Nayantara Husband

LIC Notice to Nayantara Husband

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సతీష్ విఘ్నేష్ కి నయనతార ని పెళ్లి చేసుకున్న తర్వాత పాపం వ్యక్తిగతంగా మరియు కెరీర్ పరంగా ఎదో ఒక సమస్య వస్తూనే ఉంది. కవల పిల్లలు పుట్టారని ఆనందం కొద్దీ గంటలు కూడా లేకముందే సరోగసి కేసు ఆయన మెడకి చుట్టుకుంది. ఈ కేసు కారణంగా ఆయన నయనతార తో కలిసి మొన్నటి వరకు కోర్టు చుట్టూ తిరిగాడు. ఇక ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ తో కలిసి సినిమా చేసే అవకాశం దక్కింది.

ఎంత అదృష్టం దక్కిందో అని మురిసిపోయి మూడు రోజులు కూడా కాలేదు, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. కెరీర్ మరో లెవెల్ కి వెళ్తుంది అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం తో సతీష్ మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చి మరో కొత్త ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు.

‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళం లోను, ఇటు తెలుగులోనూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ని హీరో గా పెట్టి ‘LIC’ అనే సినిమాని రీసెంట్ గానే మొదలు పెట్టాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు. గ్రాండ్ గా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. కారణం టైటిల్ అనే చెప్పాలి. LIC అనగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇండియాలో దశాబ్దాల నుండి నడుస్తున్న సంస్థ ఇది.

ఎన్నో కోట్ల మంది ఈ సంస్థ ద్వారా లావాదేవీలు నడుపుతున్నారు. అలాంటి సంస్థ పేరు ని ఒక సినిమా టైటిల్ గా వాడుకునేందుకు అసలు ఒప్పుకోమని, ఒక సినిమాకి టైటిల్ గా వాడడం వల్ల మా పరువుకి, పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంటుందని, వారం రోజుల్లోపు సినిమా టైటిల్ మార్చకపోతే చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామని, లీగల్ గా క్రిమినల్ కేసులను పెడుతాం అంటూ LIC అధికారులు డైరెక్టర్ సతీష్ విగ్నేష్ కి నోటీసులు పంపారు. దీనిపై సతీష్ విఘ్నేష్ నుండి కానీ, మూవీ టీం నుండి కానీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరి LIC అధికారులు డిమాండ్ చేసినట్టు టైటిల్ ని మారుస్తారా?, లేకపోతే వాళ్ళతో పోరాడి అదే టైటిల్ ని పెడుతారా అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version