YS Jagan : రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండడంతో ఎటుచూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక గత ఐదేండ్ల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిన అధికార వైసీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి వచ్చే నిరసనలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతీ చోటా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది.
ఇక జగన్ దింపుడు కల్లెం ఆశగా పింఛన్ల పేరిట చివరి ఆటను ఆడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉత్తుత్తి బటన్లను ఎన్నింటినో నొక్కాడు. ఎన్నికల పోలింగ్ ముందు రోజుల్లో పింఛన్లు పంపిణీ చేస్తే ఓటర్లు తమకే ఓటు వేస్తారనే దురాలోచన చేశాడు. అయినా ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. పింఛన్ డబ్బులు పడితే అవి జగన్ రెడ్డి ఇంట్లో నుంచే వేశాడు అనుకునే అమాయకులేం కాదు ఓటర్లు. వారికి అన్నీ తెలుసు. జగన్ బటన్ల నొక్కుడు మాయను వారికి బాగానే తెలుసు. అకౌంట్ ఆపరేషన్ లో లేకున్నా అకౌంట్ లో డబ్బులు వేశారు. మీ సేవాలో చూస్తే అమౌంట్ సీజ్ అయ్యి ఉంది. మరి ఆ డబ్బులు లబ్ధిదారులకు చెందాలంటే ఎలా? సంక్షేమ పథకాలకు ఇన్ని కొర్రీలు పెట్టి మీకు 99శాతం చేసేశాను అని ప్రకటిస్తే ప్రజలు నమ్మరు.
ఇలాంటి అరాచక పాలకుడిని గద్దె దించాలని ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. జగన్ పాలనను అంతమొందించడానికి మేధావి వర్గమంతా ఒక్కటైంది. ఎవరికీ తోచినట్టు వారు జగన్ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటు వేయడానికి వెనుకాడే వారిని సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటు వేసేలా చైతన్య పరుస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ ను తీర్చిదిద్దే కూటమికి ఓటు వేయాలని వారు ప్రచారం చేస్తున్నారు. ఓటు మన ఆత్మ గౌరవమని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ముందుకు రావాలంటున్నారు.
మీరు వేసే ఓటు రాజధాని నిర్మాణానికి నాంది పలుకుతుందని అవగాహన కల్పిస్తున్నారు. అరాచక పాలనను అంతం చేసి మన భూములను మనమే రక్షించుకుందామని పిలుపునిస్తున్నారు. మనం వేసే ఓటే మన రాష్ట్ర భవిష్యత్ ను నిర్మిస్తుందంటున్నారు. కూటమికి ఓటు వేసి హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు దీటుగా అమరావతిని నిర్మించుకుందామంటున్నారు. దీంతో మన బిడ్డలు మన రాష్ట్రంలోనే ఉపాధి పొందుతారని, ఇతర రాష్ట్రాలకు వెళ్లే దౌర్భాగ్యం తప్పుతుందని సూచిస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడే కూటమికి ఓటు వేయడానికి ఓటర్లు అందరూ కలిసిరావాలని కోరుతున్నారు.