US Congress : భారత్ కు అండగా ఉందాం: అమెరికా కాంగ్రెస్ లో బిల్లు

US Congress

US Congress

US Congress : భారత్ కు అండగా ఉందామంటూ అగ్రరాజ్య కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. భారత్ తో సైనిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవలసిన అవసరం ఉందని అమెరికన్ కాంగ్రెస్ లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటూ కూటమితో సమానంగా భారత్ ను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆ బిల్లులో పేర్కొన్నారు. సాంకేతికత బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లులో ప్రతిపాదించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని గుర్తు చేసింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నట్లు తేలితే పాకిస్థాన్ కు భద్రతా సాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణపూరిత వైఖరిని అనుసరిస్తోందని బిల్లు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా సవాల్ విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశాన్ని అడ్డుకోవాలంటే భారత్ తో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని బిల్లు పేర్కొంది.

TAGS