Pawan and Prakash Raj : తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తవుతున్నాయి. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే వేంకటేశ్వర స్వామి లడ్డూ అపవిత్రం చేశారని మండిపడుతున్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గత ప్రభుత్వం నిర్వాకమే అని ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అంటుండగా, ప్రజలను పక్క దారి పట్టించేందుకు తిరుమలకు రాజకీయ రంగు పులుముతున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు.
అధికార, విపక్షాల మధ్య వాదప్రతివాదనలు సహజమే. కానీ ఇందులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వ్యవహరంపై ట్వీట్ చేసి వివాదాన్ని మరింత రెచ్చగొడుతున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. లడ్డూ వివాదం చెలరేగిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ లడ్డూ వివాదానికి మతం రంగు ఎందుకు పులుముతున్నారంటూ పవన్ కల్యాన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా మండిపడ్డారు. పవన్ కు మద్దతుగా నిలిచారు.
ప్రకాష్ రాజ్ మరోసారి ఈ విషయంలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను చేసిన ట్వీట్ ను పవన్ మరోసారి చదవాలని సూచించాడు. తాను విదేశాల్లో ఉన్నానని ఈ నెల 30న వస్తున్నామని దీని గురించి చర్చిద్దామంటూ సవాల్ విసిరాడు. ఈ వీడియోపై పవన్ కల్యాన్ ఇంకా స్పందించలేదు. పవన్ స్పందన ఎలా ఉండబోతుంది. ప్రకాష్ రాజ్ సవాల్ ను పవన్ కల్యాణ్ స్వీకరిస్తాడా లేదా చూడాలి మరి..