CM Revanth Reddy : తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణను ఇక నుంచి ‘ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియలో ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘‘ది ఫ్యూచర్ స్టేట్’’కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. కాలిలపోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.ఐటీ యునికార్న్ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్ సందర్శించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.