Leo Actor Sensational Comments : త్రిషతో రేప్ సీన్ చేద్దామనుకున్నా.. లియో నటుడి సంచలన కామెంట్లు..!

Leo Actor Sensational Comments
Leo Actor Sensational Comments : నటి త్రిష గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.. అందుకు కారణం లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్.. ఇతడు త్రిషపై చేసిన కామెంట్స్ తో కోలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది.. ఈమెకు సపోర్ట్ గా అందరు ఆ నటుడిని ఏకి పారేస్తున్నారు.. ఇంతకీ అతడు చేసిన కామెంట్స్ ఏంటి? అంటే..
కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ‘లియో’.. స్టార్ హీరో విజయ్ దళపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయం సాధించింది.. మరి లియో సినిమాలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే..
ఇదిలా ఉండగా మన్సూర్ అలీ ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు.. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. ఈ వయసులో ఒక స్టార్ హీరోయిన్ పై అలంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ ఈయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ”లియో సినిమాలో త్రిష నటిస్తున్నారని తెలిసి ఈమెతో ఒక్క బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని ఊహించుకున్నా.. ఇతర నటీమణులతో చేసినట్టే ఈమెతో కూడా చేస్తానని అనుకున్న.. సినిమాల్లో నేను రేప్ సీన్స్ చాలానే చేశాను.. నాకు ఇలాంటివి కొత్త కాదు.. కానీ కాశ్మీర్ లో షూట్ జరుగుతున్నప్పుడు త్రిషను ఒక్కసారి కూడా చూపించలేదు” అంటూ ఇతడు చేసిన కామెంట్స్ పై సెలెబ్రిటీలు, నెటిజెన్స్ సైతం మండిపడుతున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అలాగే లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సైతం ఈమెకు మద్దతుగా పోస్టులు చేసారు..