JAISW News Telugu

KTR : ఆ మంత్రికి లీగల్ నోటీసులు.. ఆరోపణలను నిరూపించగలరా?: కేటీఆర్ సవాల్..

KTR

KTR

KTR : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టాపిక్ అంతా ఫోన్ టాపింగ్ వ్యవహారం చుట్టూనే తిరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఫోన్ టాపింగ్ జరిగిందని అది అప్పటి విపక్ష నాయకులపై తీవ్రంగా ప్రభావం పడిందని ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఫోన్ టాపింగ్ లో కేటీఆర్ పాత్రపై తీవ్రంగా ఆరోపణలు చేసింది. దీనిపై కేటీఆర్ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంతో తమకు సంబంధం లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఖండించారు. బుధవారం (ఏప్రిల్ 3) పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో తన పేరును కూడా ఆరోపించి తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను హీరోయిన్లను బెదిరిస్తున్నానన్న ఆరోపణలు వారి అభూత కల్పనలు మాత్రమే. ఇలాంటి ఆరోపణలను సహించేది లేదు. న్యాయపరంగా సమస్యను ఎదుర్కొంటా’ అన్నారు.

2004 నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ.. పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో అప్పటి తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేక్‌ తమ ఫోన్లను కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు. 2022లో తమ ఫోన్‌లు హ్యాక్‌ అయ్యాయని యాపిల్‌ కంపెనీ తనను, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని హెచ్చరించిందని కేటీఆర్‌ చెప్పారు.

Exit mobile version