TV9 Rajinikanth : ఇటీవల కాలంలో టీవీ-9 అంటే రజనీ కాంత్.. రజనీ కాంత్ అంటే టీవీ-9 అన్నంతలా మారిపోయింది. అలాంటి ఆయన ఓ ట్వీట్ పెట్టారు. దాని సారాంశం తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని .. తప్పుడు సమాచారం ఇస్తూ పర్సనల్ గా తనను టార్గెట్ చేస్తున్నారని, అలాంటివారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటానని దాని సారాంశం. ఆ ట్వీట్ చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆ ట్వీట్‌ను ఆయనకే అన్వయిస్తే.. రోజుకో పది సార్లు లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సదరు ఛానల్ టీవీ-9 నుంచి రవిప్రకాష్ నుంచి గెంటేసిన తర్వాత ఆ సీటును రజనీకాంత్ ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి టీవీ-9 అబద్ధాల ఫ్యాక్టరీగా మారిపోయిందని నెటిజన్లు అంటున్నారు. అలా ఇలా కాదు.. ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వార్తలను వండి వార్చుతోంది. ఎన్ని వార్తలు ప్రసారం చేసారో లెక్కేలేదు. ఆ బాధితుల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కూడా ఉన్నారు.
ఉదాహరణకు 2019 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా మూడు రోజులు ఇంట్లోనే ఉంచారు. ఆ మూడు రోజులు టీవీ-9లో ప్రసారం చేసిన వివరాలేమిటి? వాటికి సంబంధించి కనీస ఆధారాలను బయట పెట్టగలరా? తప్పుడు పత్రాలను సృష్టించి మరీ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఈటలను గెంటేయాలనుకున్నప్పుడు ఆ కుట్రలో తప్పుడు ప్రచారాలు చేయడంలో భాగమయింది రజనీకాంత్ కాదా? అని కామెంట్లు వస్తున్నాయి. ఇవి మచ్చుకు రెండే.. రజనీకాంత్ నాయకత్వంలో టీవీ-9 చరిత్ర తిరగేస్తే… మీడియా ముసుగులో చేసిన ఘోరాలు ఎన్నో. ఏపీలో జగన్ కోసం టీడీపీపై లెక్కలేనన్ని తప్పుడు ప్రచారాలు చేసింది సదరు చానెల్. చంద్రబాబు, లోకేష్ సహా ఎంత మంది క్యారెక్టర్లపై నిందలేశారు. పెద్ద పెద్ద సభలు జరిగినా కనీస కవరేజీ ఇవ్వని వారు.. క్యారెక్టర్ పై నిందలేయడానికి మాత్రం బ్రేకింగులు వేసేవాళ్లు. ఇప్పుడు రజనీకాంత్ గురించి వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారం అంతా పచ్చి నిజాలు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లే వాటిని బయటకు విడుదల చేశారు. ఆధారాలతో సహా అవే ప్రజల ముందుకు వస్తాయని పలువురు అంటున్నారు.