Jagan Colony Houses : ఆంధ్రప్రదేశ్ లో పేదల కోసం చంద్రబాబు కట్టించిన ఇళ్లను కాదని జగన్ వేరే ఇళ్లు కట్టిస్తున్నాడు. వాటికి ఎలాంటి సదుపాయాలు లేవు. సొంతింటి కల సాకారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ వారి కోరిక తీరడం లేదు. గతంలో చంద్రబాబు కట్టించిన ఇళ్లను ఇస్తే సరిపోతుంది. కానీ జగన్ వాటిని కాదని వేరే ఇళ్లు కట్టిస్తున్నారు. వాటికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు.
బాబు కట్టించిన ఇళ్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కట్టించినవేమో పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ప్రభుత్వాల మొండి వైఖరి వల్ల పేదలకు అందాల్సిన ఇళ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. చెదలు పట్టిపోతున్నాయి. ఎందుకు వాటిని ఇవ్వకూడదనే దానిపై స్పష్టత లేదు. పేదవాడి సొంతింటి కల ఏనాటికి తీరుతుందో తెలియడం లేదని చెబుతున్నారు.
ఆవులు ఆవులు కలిసి పొడుసుకుంటే లేగల కాళ్లు ఇరిగినవి అన్నట్లు ప్రభుత్వాల మధ్య బేషజాల వల్ల పేదలకు ఇళ్లు దక్కడం లేదు. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను పంపిణీ చేయకుండా కొత్త వాటిని నిర్మిస్తూ ప్రభుత్వ సొమ్మును నిర్వీర్యం చేస్తున్నాయనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. పేదవాడికి మాత్రం గూడు దక్కడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
నిడదవోలు పక్కన సోమవారం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న మొండి విధానాల వల్ల పేదవాడి ఇంటి కల తీరకుండాపోతోందని అంటున్నారు. గతంలో కట్టించిన ఇళ్లు అందరికి ఇస్తే ఇళ్ల సమస్య రాదు. కానీ వారి ప్రగల్బాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడుతున్నారు. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య వైషమ్యాలు పోతేనే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి.