Shekhar basha : ఇంటికెళ్తే ఎందుకొచ్చావ్ వెళ్లిపోమన్న భార్య.. షాకైన శేఖర్ భాష  

Shekhar Bhasha

Shekhar Bhasha

Shekhar basha : బిగ్ బాస్ సీజన్-8లో తన పంచులతో నెటిజన్లకు మంచి కంటెంట్ అందించిన కంటెస్టెంట్ శేఖర్ బాషా. నాన్ సింక్ పంచ్ లతో బిగ్ బాస్ హౌస్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు.. బెస్ట్ వ్యూ అంటే ఐ లవ్ యూ, చిరాకు అంటే చీ రాకు అంటూ శేఖర్ బాషా చెప్పిన ఒక్కో డైలాగ్..  డైమండ్ గా నిలిచిపోయింది. ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండి ఉంటే మంచి క్రేజ్ వచ్చేది. కానీ రెండో వారంలోనే హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేట్ అయ్యాడు.

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగు పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయారు.  ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన భార్య డెలివరీకి మూడు రోజుల ముందు వరకు తనకు ఒకటే టెన్షన్  అని.. అందుకే ఎలిమినేట్ అయ్యానని శేఖర్ బాషా తెలిపాడు. ఇక ఇంటికెళ్తే నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్లిపోమని అంది. కనీసం   టాప్-5 లోనైనా నువ్వు ఉంటావని అనుకున్నా కానీ ఇలా చేశావేంటని అన్నది. నా బాబుని ఎత్తుకున్న ఆ సంతోషం చాలు అని అనుకున్నా కానీ నేను ఎలిమినేట్ అయ్యానని తెలిసి తను బాగా ఏడ్చేసిందట అని శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. వాళ్ళెలా అనుకున్నా , బిడ్డని ఎత్తుకోవాలనుకున్నాను.. తన పక్కనున్నాను.. హ్యాపీ.

బిగ్ బాస్ కి వెళ్లేందుకే రాజ్ తరుణ్ ఇష్యూను హైలెట్ చేశారని కొందరు అంటున్నారు. దీనికి మీ సమాధానం అని ప్రశ్నించగా..  అసలు నేను వెళ్తానో లేదో కూడా క్లారిటీ లేదు. డెలివరీ దగ్గర పడింది కాబట్టి వెళ్లాలా వద్దా అని నా భార్యను అడిగితే.. ఓ రోజంతా వెయిట్ చేసి వెళ్లమని చెప్పింది. వారం రోజుల ముందు వరకు అసలు తెలియదు.. బిగ్ బాస్ టీమ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో.. నా భార్య డెలివరీకి ఒక్కరోజు పర్మిషన్ కావాలి లేదంటే చూపించాలి.. ట్రై చేస్తామని అన్నారంటూ శేఖర్ బాష తెలిపారు.

TAGS