Gangula Kamalakar : కరీంనగర్ నియోజకవర్గంలో గంగుల కమలాకర్ గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తుంది. మంత్రిగా ఉన్న ఆయన నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తే బాగుండును కానీ.. సొంత పార్టీ నేతలే ఆయనను విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు, మహిళలు, ఓటర్లు, యువకులు, నిరుద్యోగులు నిలదీస్తున్నారు. లెక్కకు మంచి పథకాలు తెచ్చామని, పటిష్టంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకున్నా సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు.
ఇదంతా ఒకెత్తయితే ఎంఐఎం కూడా గంగులకు సపోర్టుగా నిలవడం లేదని టాక్ వినిపిస్తుంది. పార్టీలోని మైనారిటీ నేతలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారట. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో బహిరంగంగానే ఆయనను నిలదీస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ భూముల అంశం మంత్రి గంగులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇటీవల రేకుర్తిలో మైనార్టీల ఇళ్లు కూల్చివేశారు. ఇందులో గంగుల హస్తం ఉందని తీవ్రంగా ప్రచారం జరిగింది. సాక్షాత్తు ఆయన పార్టీకి చెందిన నేతలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.
ఇక తన సామాజిక వర్గాన్ని మాత్రమే పట్టించుకుంటున్నాడన్న అపవాదు మూట గట్టుకుంటున్నాడు. ఇక ఆయా గ్రామాలకు వెళ్తే ఆయనను ఆదరణ అటుంటి నిలదీత ఎదురవుతోంది. ఏళ్లుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏం చేశావు? అంటూ మహిళలు నిలదీస్తున్నారట. పైగా ఐదేళ్లుగా మంత్రిగా కూడా ఉండి చేసిందేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే కమీషన్ల గురించి మాట్లాడాలని కోరుతున్నారు. బీసీ బంధు, దళిత బంధులో వాటాలు తీసుకున్నారంటూ ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మంత్రి.