Leader : 14 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ‘లీడర్’! రీ రిలీజ్ చేయనున్న మేకర్స్..

Leader

Leader

Leader : రానా దగ్గుబాటి నటించిన తెలుగు చిత్రం ‘లీడర్’ థియేటర్లలో విడుదలకు తిరిగి సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామా 2010లో థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నిర్మాతలు 14 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో తిరిగి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

ఈ మేరకు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేస్తూ ‘లీడర్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మే 9న మీ క్యాలెండర్లను గుర్తుంచుకోండి, మేము గ్రిప్పింగ్ పొలిటికల్ డ్రామాను తిరిగి తీసుకువస్తాము.’ అని పోస్ట్ చేసింది.

‘లీడర్’లో రానా దగ్గుబాటి మేన్ రోల్ చేయగా.. అర్జున్ ప్రసాద్ లీడ్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా కథ అర్జున్, అతని తండ్రి చుట్టూ తిరుగుతుంది. కొడుకు రాజకీయ నాయకుడిగా రాణించాలన్నది తండ్రి చివరి కోరిక కావడంతో రానా తను సీఎం కావాలని అనుకుంటాడు. అయితే.. ఆ స్థానంలో పెద్దాయన (కోట శ్రీనివాస్ రావు) సుబ్బరాజును పెడతాడు. సుహాసిని తన కొడుకు (రాణా) ముఖ్యమంత్రి కావాలని అడగడంతో ఒక్క రోజులో సీన్ మారిపోతుంది. కట్ చేస్తే రాణా ముఖ్యమంత్రి అవుతాడు. తండ్రి హత్య తర్వాత అర్జున్ ఆ దారిలో వెళ్తాడు. దీంతో అతనికి ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమిస్తాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.

ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్, సుహాసిని మణిరత్నం, సుమన్ తదితరులు నటించారు. కోట శ్రీనివాస రావు, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

TAGS