Raghava Lawrence : లారెన్స్ కు బయంకరమైన వ్యాధి.. అప్పుడు ఏం చేశాడో తెలుసా?

Raghava Lawrence

Raghava Lawrence

Raghava Lawrence : రాఘవ లారెన్స్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సుపరిచితుడే. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన డైరెక్టర్ గా, హీరోగా, ప్రొడ్యూసర్ గా కూడా రాణించారు. మంచి మనస్సున్న వ్యక్తిగా కూడా ఆయనను తమిళలు కొలుస్తారు. అప్పట్లో వదరబాధితులను ఆదుకునేందుకు సుమారు రూ. 100 కోట్ల వరకు విరాళం అందజేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎవ్వరూ ఇవ్వలేని విరాళం ఇచ్చారు. ఆయన పెట్టిన ట్రస్ట్ నిరంతరం పేదలకు సేవలు చేస్తూనే ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత ఆపరేషన్ చేయించి పునర్జన్మ ఇచ్చారు రాఘవ లారెన్స్. ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి విద్యా, బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేశాడు. ఇంత మంచి మనసున్న ఆయన బాల్యంలో ప్రమాదకరమైన వ్యాధితో పోరాడాడట. బాల్యంలో ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండేదట.

బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఆయనను రక్షించేందుకు ఆయన తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగారట. ఎక్కడ చూపించినా నయం కాలేదట. ఆ తర్వాత ఆయన తల్లి తల్లి రాఘవేంద్ర స్వామిని కొలిచిందని. ఆయన ఆశీస్సులతో ఈ వ్యాధి నుంచి బయటపడ్డాడని టాక్. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతోనే తాను బతికాను కాబట్టి అప్పటి నుంచి  లారెన్స్ ముందు రాఘవ పేరును యాడ్ చేసుకున్నారట.

ఇప్పటికీ రాఘవ లారెన్స్ రాఘవేంద్ర స్వామికి వీర భక్తుడు. ప్రతీ ఏటా ఆయన మాల ధరిస్తారట. తను చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు ఏ చిన్నారి ఎదుర్కోవద్దనే ఆయన తల్లి ఆదేశాలతో ఆయన ట్రస్ట్ లు పెట్టి నడిపిస్తున్నారట. ఇక ఆ ట్రస్ట్ ద్వారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు తెలిసినవే.

TAGS