Lavanya Tripathi Big Sacrifice : కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొని వారి లవ్ మ్యాటర్ పెద్దలను చెప్పి ఒప్పించి ఒక్కటైన జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి. ఇటలీలో వారి పెళ్లి నవంబర్ 1న గ్రాండ్ గా జరిగింది. దగ్గరి బంధువుల సమక్షంలో లావణ్య మెడలో తాళి కట్టిన వరుణ్ తేజ్ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిషప్షన్ కూడా ఏర్పాటు చేశారు. నిహారిక, లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పరిచయానికి ముందే బెస్ట్ ఫ్రెండ్స్ అట. అయితే వీరి పరిచయం ఒక జిమ్ లో జరిగిందని తెలిసింది.
ఈ ఫ్రెండ్ షిప్ మూలంగానే మెగా కుటుంబానికి దగ్గరైన లావణ్య త్రిపాఠి. తర్వాత వరుణ్ తేజ్ కూడా ఫ్రెడ్ షిప్ చేసి ‘మిస్టర్’ మూవీతో వరుణ్ తేజ్ పక్కన నటించే ఛాన్స్ సంపాదించింది. ఈ మూవీతో మొదలైన వారి ఫ్రెండ్ షిప్ అంతరిక్షం మూవీ వరకు లవ్ ట్రాక్ పై పడిందట. ఇంకే ముంది కట్ చేస్తే వివాహం.
అయితే లావణ్య త్రిపాఠి సినిమాలు వద్దు అనుకుంటుందట. వీటిని కొంత కాలం పక్కన పెట్టి దాంపత్యం, చిల్డ్రన్స్ ప్లాన్ పై దృష్టి పెట్టాలి అనుకుంటుందట. కానీ నిహారిక కోసం కొన్ని నెలలు సంతానం వద్దనుకుంటుందట. కెరీర్ లో పెద్దగా సక్సెస్ సాధించలేని నిహారిక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకుంటుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌజ్ పెట్టిన ఆమె నటిగా కూడా కంటిన్యూ కావాలని అనుకుంటుందట.
దీనిలో భాగంగానే అన్న, వదినలు తన ప్రొడక్షన్ హౌజ్ లో ఒక సినిమా చేయాలని కోరిందట. అందుకు సోదరుడు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంకేముంది వదిన కూడా చేయాల్సి వస్తుంది కదా. ఈ లోపు పిల్లలంటే ఆడబిడ్డ ఆగమవుతుందని భావించిన లావణ్య త్రిపాఠి కొన్ని రోజులు సంతానం వద్దనుకుందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కామెంట్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.